జనాభాలో 15 శాతం తొలగింపు.. ‘సర్’పై మాజీ సీఈసీ ఎస్వై ఖురేషీ విమర్శలు
ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ రాష్ర్టాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ తీవ్ర విమర్శలు చేశారు. ‘సర్' పేరుతో దేశ జనాభాల్లో 15శాతం మందిని ఓటర్ల జాబితా నుండి ఈసీ తొలగించిందని ఆయన ఆరోపించారు.
భువనేశ్వర్, సెప్టెంబర్ 6 : ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ రాష్ర్టాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ తీవ్ర విమర్శలు చేశారు. ‘సర్’ పేరుతో దేశ జనాభాల్లో 15శాతం మందిని ఓటర్ల జాబితా నుండి ఈసీ తొలగించిందని ఆయన ఆరోపించారు. ఆదివారం భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షాల విమర్శలు, ఎన్నికల ఆందోళనల నడుమ పలు రాష్ర్టాల్లో ‘సర్’ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నదని ఆరోపించారు.
భారత ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు. ‘తొలగించిన ఓటర్ల గణాంకాలను బయటపెట్టాలని కోరుతున్నా. తద్వారా మీరు ఎంతటి ఘన విజయం సాధించారో, అలాగే జాతీయ జనాభా కమిషన్ చేయలేని పనిని మీరు ఎలా పూర్తిచేశారో మాకు తెలుస్తుంది. భారతదేశ జనాభాలో సుమారు 15 శాతాన్ని తొలగించటం ద్వారా జనాభా నియంత్రణకు మీరు ఎంతో కృషి చేశారు’ అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ప్రస్తుతం చేపట్టిన ‘సర్’ ప్రక్రియపై ఆయన ఇంతక్రితం పలు విమర్శలు చేశారు. ‘సర్’ ప్రక్రియ వెనుక సదుద్దేశం లేదని ఆయన తప్పుబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

