‘ఇందిరమ్మ’ ఇవ్వడం లేదు!
అంబర్‌పేట మండల పరిధిలోని బాగ్‌అంబర్‌పేట, బతుకమ్మకుంటలో చిట్కోళ్ల మునీ, నరసింహ దంపతులు కొన్నేండ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. నరసింహ ఆటో నడిస్తుండగా, మున్నీ ఇండ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట దరఖాస్తు చేసుకోమని చెప్పగా మున్నీ రూ.10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు నంబర్ 137409గా ఉంది.
- డ్రా వచ్చిందని చెప్పి బుకాయింపు
- వీడియో క్లిప్పు చూపిస్తే బెదిరించిన హౌసింగ్ బోర్డు అధికారి బాబురావు
- న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత కుటుంబ సభ్యులు
అంబర్‌పేట, సెప్టెంబర్ 6: అంబర్‌పేట మండల పరిధిలోని బాగ్‌అంబర్‌పేట, బతుకమ్మకుంటలో చిట్కోళ్ల మునీ, నరసింహ దంపతులు కొన్నేండ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. నరసింహ ఆటో నడిస్తుండగా, మున్నీ ఇండ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట దరఖాస్తు చేసుకోమని చెప్పగా మున్నీ రూ.10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు నంబర్ 137409గా ఉంది.
ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలన అనంతరం అన్ని పత్రాలు సక్రమంగా ఉండటంతో డ్రాలో వేయడానికి అధికారులు ఓకే చేశారు. గత నెల 29న అంబర్‌పేట నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల డ్రాను హౌసింగ్ బోర్డు అధికారులు ఛే నంబర్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, హౌసింగ్ బోర్డు అధికారులు పాల్గొని లాటరీ పద్ధతిన 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. హౌసింగ్ బోర్డు ఈఈ బాబురావు ఎస్సీ కోటా కింద చిట్కోళ్ల మున్నీ(దరఖాస్తు నంబర్ 137409)కు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అందరి సమక్షంలో ప్రకటించారు. అక్కడే ఉన్న మున్నీ భర్త నరసింహ తమకు ఇల్లు వచ్చిందని సంతోషపడి పనికి వెళ్లిన భార్యను తీసుకొని ఫంక్షన్‌హాల్‌కు వచ్చాడు. ఇద్దరు కలిసి ఈఈ బాబారావును మీకు డ్రాలో ఇల్లు వచ్చిందని, రెండు రోజుల తర్వాత ఫోన్‌కు మెసేజ్ వస్తుందని తర్వాత మీరు నాంపల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయానికి రావాలని సూచించారు.
రెండు రోజులైనా ఫోన్‌కు మెసేజ్ రాకపోవడంతో ఆందోళన చెందిన మున్నీ, సరసింహ దంపతులు నాంపల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వెళ్లి ఈఈ బాబురావును కలిశారు. మీరు ఐడీ ప్రూప్‌లు సరిగ్గా పెట్టలేదని, డ్రాలో ఇల్లు రాలేదని ఈఈ బాబారావు బుకాయించారు. మున్నీకి ఇల్లు వచ్చినట్లు బాబారావు డ్రా తీసిన రోజు ప్రకటించిన వీడియో క్లిప్పింగ్‌ను ఆయనకు చూపించారు. అయినప్పటికీ ఈఈ బాబారావు అవేమీ పట్టించుకోకుండా మీకు ఇల్లు రాలేదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడని మున్నీ, నరసింహ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.
పత్రాలు తప్పుగా ఉంటే రద్దు చేస్తాం : ఈఈ బాబురావు
ఈ విషయమై హౌసింగ్ బోర్డు ఈఈ బాబురావును ప్రశ్నించగా..డ్రాలో వచ్చిన వారందరి వివరాలు మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని పత్రాలు తప్పుగా ఉంటే రద్దు చేస్తామని చెప్పారు. అయితే వీరి విషయానికి వచ్చేసరిగా బుకాయించడం చేశారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు సంబంధించి మున్నీకి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయి. వీరికి సొంత ఇల్లు లేదు. కారులేదు. ఆటో నడిస్తాడు. వీరి కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద కూడా ఇండ్లు లేవు. సరికదా..అన్ని పత్రాలు పరిశీలన(స్కృటినీ) చేసిన తర్వాతనే డ్రాలో వేశారు. పత్రాలు సరిగ్గా లేని వారివి డ్రా లో వేయకముందే తిరస్కరించారు. మరి వీరి దరఖాస్తు లో అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నందునే డ్రాలో వేశారని మున్నీ తెలిపారు. ఇప్పుడు ఎలా ఇల్లు రాలేదని చెబుతారని వాపోయారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

