దైవిక శక్తి మమ్మల్ని నడిపించింది
సుమంత్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న స్పిరిచ్యుయల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సుమంత్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న స్పిరిచ్యుయల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ‘ఇటీవలకాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ దక్కుతున్నది. ఇది ఆ తరహా చిత్రమే అనిపిస్తున్నది. నాకు చిన్నతనం నుంచే సుమంత్ అన్నతో గొప్ప అనుబంధం ఉంది. ఏం కావాలన్నా కాదనకుండా తెచ్చి పెట్టేవాడు.
అందుకే నాకు ఆయన స్పెషల్ బ్రదర్. ఇక ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడనిపించింది. దైవిక అంశాలు గొప్ప కంటెంట్‌తో సినిమా చేయడం నిజంగా గ్రేట్. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతున్నదని నా అంతరాత్మ చెబుతున్నది’ అన్నారు. సుమంత్ తన కెరీర్లో విభిన్నమైన కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నారని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రయాణం మూడేళ్ల క్రితం మొదలైంది. గొప్ప స్థాయిలో చేద్దామనుకున్నాం. దేవీకృప వల్ల అన్నీ అనుకున్నట్లుగా సాగి అద్భుత చిత్రంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏదో దైవిక శక్తి మమ్మల్ని నడిపించిందనే నమ్మకం కలిగింది. సిద్ధు పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది’ అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిపంచే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

