సూరి, సుహాస్ కథానాయకులుగా రూపొందుతున్న సముద్రతీర ప్రాంత నేపథ్య యాక్షన్ డ్రామా ‘మండాడి’. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే వినూత్న కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని హీరో సుహాస్ చెప్పారు. పడవ పందేల నేపథ్యంలో సముద్రం మీద చిత్రీకరించిన పోరాటఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. విభిన్నమైన కంటెంట్‌తో బడ్జెట్‌పరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉందని మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని పేర్కొన్నారు.