హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఒకే టీచర్‌కు బహుళ తరగతుల బోధన.. ఇతర బాధ్యతలను నిరసిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టాలని ఎస్జీటీయూ పిలుపునిచ్చింది. గురువారం నుంచి నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో టీచర్లంతా నిరసనలు తెలియజేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా చిల్వకోడూరు మండలంలో టీచర్ ప్రశాంత్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో తీవ్ర ఒత్తిడికి గురైన ఘటనపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలపై చర్యలు తీసుకోవాలని సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే శారద, ఎం దేవదాస్, సీహెచ్ శౌరి కోరారు.