సన్రైజర్స్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బంతి అందుకున్న తొలి ఓవర్లోనే ప్రమాదకర క్వింటన్ డీకాక్ (1)ను అవుట్ చేసిన సుందర్.. నాలుగో ఓవర్ తొలి బంతికే విండీస్ విధ్వంసకారుడు ఎవిన్ లూయిస్ (1)ను కూడా పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు ఓవర్లో కూడా ఎల్బీ ప్రమాదం తప్పించుకున్న లూయిస్..
నాలుగో ఓవర్ తొలి బంతికి కూడా స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి ప్యాడ్లను తాకింది. అప్పీలు చేయగానే అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. దాంతో లక్నో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. లూయిస్ పెవిలియన్ చేరాడు.