సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి గిల్ అవుటయ్యాడు. భువీ వేసిన బంతిని డ్రైవ్ చేసేందుకు గిల్ ప్రయత్నించాడు.
అయితే కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠీ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 24 పరుగుల వద్ద గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయినట్లయింది. గిల్ అవుటవడంతో సాయి సుదర్శన్ క్రీజులోకి వచ్చాడు.