IPL 2026 : భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. ఫిట్నెస్ చాటుకున్నా సరే అతడికి జాతీయ జట్టులో చోటుదక్కడం లేదు. అసలే సెలెక్టర్ల తీరుతో విసిగిపోతున్న ఈ స్టార్ పేసర్‌కు ఐపీఎల్‌లోనూ షాక్ తగలనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ అతడిని వదులుకునేందుకు సిద్ధమైంది. రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ షమీని ట్రేడ్ పద్ధతిని అమ్మేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. అనుభవజ్ఞుడైన షమీని కొనేందుకు లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపిస్తోంది. ఈ వెటరన్ కోసం ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ధర ఫైనల్ అయిందంటే అధికారిక ప్రకటన రేపో మాపో రావడం ఖాయం.
ఐపీఎల్ 19వ సీజన్‌కు రిటెన్షన్ గడువు నవంబర్ 15. శనివారం సాయంత్రం 3 గంటల లోపే అట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి ఫ్రాంచైజీలు. అందులో భాగంగానే ట్రేడ్ డీల్‌ను ఉపయోగించుకుంటున్నాయి పలు జట్లు. తమకు అవసరం లేని,, ఇతర ఫ్రాంచైజీ కోరుకుంటున్న ఆటగాళ్లను స్వాప్ విధానంలో మార్చుకుంటున్నాయి.
Sunrisers Hyderabad have agreed to trade Mohammed Shami to Lucknow Super Giants.
The trade is likely to be an all-cash deal worth INR 10 crore
Full story: https://t.co/QIwOMhGxLr pic.twitter.com/BEMPPvdpzS
— ESPNcricinfo (@ESPNcricinfo) November 14, 2025
ఈ క్రమంలోనే పేస్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ (Shardul Thakur)ను ముంబై ఇండియన్స్‌కు రూ.2కోట్లకు అప్పగించిన లక్నో.. ఈసారి సన్‌రైజర్స్ నుంచి షమీని తీసుకోవాలనుకుంటోంది. నిరుడు వేలంలో అతడిని ఆరెంజ్ ఆర్మీ రూ10 కోట్లకు కొన్నది. సో.. ఇప్పుడు అంతే ధరకు షమీని లక్నోకు అమ్మాలని కావ్యా మారన్ టీమ్ అనుకుంటోంది. ప్రస్తుతం ఇరుజట్ల యజమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అదే మొత్తానికి అంగీకరిస్తే.. వచ్చే సీజన్లో షమీ లక్నో జెర్సీతో బరిలోకి దిగుతాడు. 18వ సీజన్లో హైదరాబాద్ తరపున ఆడిన షమీ 14 మ్యాచుల్లో 6 వికెట్లతో నిరాశపరిచాడు.
సమాచారం లేదంటూ తనను పక్కన పెడుతున్న సెలెక్టర్ల వైఖరిని విమర్శిస్తూనే.. రంజీ ట్రోఫీలో షమీ నిప్పులు చెరుగుతున్నాడు. తన ఫిట్‌నెస్‌పై వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెడుతూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడీ స్పీడ్‌స్టర్. ఉత్తరాఖండ్‌పై ఏడు వికెట్లతో చెలరేగిన షమీ.. గుజరాత్‌పైనా విజృంభించాడు. చివరిరోజు ఐదు వికెట్లు తీసిన ఈ పేస్ గన్.. బెంగాల్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో విజయం దిశగా సాగుతున్న ప్రత్యర్థిని షమీ దెబ్బకొట్టగా.. పన్నెండేళ్ల తర్వాత బెంగాల్ జట్టు గుజరాత్‌పై విజయాన్ని చవిచూసింది.
Mohammad Shami deserves to play the world cup 2027 more than Rohit , Virat and Bumrah.
He has done the most damage to batsman in 2023 world cup.
He showed in Ranji recently that he still has the stump breaking skills 🤩pic.twitter.com/J0Cikq7p3m— Venky Mama (@venkymama100) October 30, 2025