IPL 2025 : వాంఖడేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హాష్ సెంచరీకి చేరువైన ఓపెనర్ అభిషేక్ శర్మ(40) ఔటయ్యాడు. ఆ కాసేపటికే డేంజరస్ ఇషాన్ కిషన్(2) స్టంపౌట్ అయ్యాడు. దాంతో, 68 వద్ద సన్‌రైజర్స్ రెండో వికెట్ పడింది. ప్రస్తుతం ఓపెనర్ ట్రావిస్ హెడ్(23), నితీశ్ కుమార్ రెడ్డి(1) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు స్కోర్.. 70-2.
టాస్ ఓడిన హైదరాబాద్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ముంబై పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ఉరికించారు. బుమ్రా, చాహర్, పాండ్యా.. ఎంత ప్రయత్నించినా వికెట్ మాత్రం దక్కలేదు. అయితే.. ఆచితూచి.. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న హైదరాబాద్‌ను హార్దిక్ పాండ్యా దెబ్బకొట్టాడు. కాసేపటికే విల్ జాక్స్ బౌలింగ్‌లో ఇషాన్ స్టంపౌట్ అయ్యాడు. దాంతో, 9 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయింది హైదరాబాద్.