ODI World Cup Squad : ఏడాది తర్వాత టీ20ల్లో పునరాగమనం చేసి అదరగొట్టిన షఫాలీ వర్మ (Shafali Verma)కు మహిళల వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీచరణి (Sree Charani) తొలిసారి ప్రపంచ కప్ బెర్తు దక్కించుకుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ పోటీలకు మరో నలభై రోజులు ఉంది. టోర్నీ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకొని మంగళవారం సెలెక్టర్లు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
సొంతగడ్డపై జరుగుబోయే వరల్డ్ కప్‌లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత జట్టు. అందుకు తగ్గట్టుగా జట్టు కూర్పు ఉండాలని పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు. కాబట్టి.. కొన్నిరోజులుగా వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న వాళ్లనే స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ గడ్డపై ఒక్క మ్యాచ్‌లో మెరిసి.. తాజాగా ఇండియా ఏ తరఫున విఫలైమన షఫాలీకి సెలెక్టర్లు షాకిచ్చారు.
A power packed #TeamIndia squad for the ICC Women’s Cricket World Cup 2025 💪
Harmanpreet Kaur to lead the 15 member squad 🙌🙌#WomenInBlue | #CWC25 pic.twitter.com/WPXA3AoKOR
— BCCI Women (@BCCIWomen) August 19, 2025
ఓపెనర్‌గా ఆమెను టీ20లకే పరిమితం చేస్తూ యువకెరటం ప్రతీకా రావల్‌కు తీసుకున్నారు. ఈమధ్యే మంధానకు జోడీగా దంచేసిన ప్రతీకా.. వరల్డ్ కప్‌లోనూ ఇన్నింగ్స్ ఆరంభించనుంది. వికెట్ కీపర్లుగా రీచా ఘోష్, యస్తికా భాటియాలు చోటు దక్కించుకోగా ఆల్రౌండర్లుగా దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రానా, అమన్‌జోత్ కౌర్‌లు ఎంపికయ్యారు. బౌలింగ్ యూనిట్లో రేణుకా సింగ్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డిలు ఉన్నారు. సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్ షురూ కానుంది.
వరల్డ్ కప్ స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్.
స్టాండ్ బై : తేజల్ హస్నబిస్, ప్రేమా రావల్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రీ, మిన్ను మణి, సయాలీ సథ్ఘారే.
The Women’s Selection Committee is here at BCCI HQ, Mumbai, to pick #TeamIndia’s squad for the upcoming three-match ODI series against Australia and the ICC Women’s Cricket World Cup.#WomenInBlue pic.twitter.com/02GtZhTDYs
— BCCI Women (@BCCIWomen) August 19, 2025