Dutee Chand | డోపీగా పట్టుబడిన స్ప్రింటర్ ద్యుతీ చంద్.. తాత్కాలిక సస్పెన్షన్
Dutee Chand | డోపీ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై తాత్కాలికంగా సస్పెన్షన్ విధించారు. నాలుగు ఆసియా క్రీడల్లో కాంస్యం, రజత పతకాలను ద్యుతీ సాధించింది.
Dutee Chand | భారతదేశం స్ప్రింటర్ ద్యుతీ చంద్ డోపీగా పట్టుబడింది. దాంతో ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు విధించారు. సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ (ఎస్ఏఆర్ఎం) కోసం ద్యుతీ చంద్‌ను పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) వెబ్సైట్లో ఈ వివరాలను పొందుపరిచారు. ద్యుతీ చంద్ భారతదేశానికి చెందిన అత్యంత వేగమైన మహిళా రన్నర్‌గా పేరు తెచ్చుకున్నారు. 100 మీటర్ల జాతీయ ఛాంపియన్‌గా కూడా నిలిచారు.
వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (వాడా) ప్రకారం, ఈ నిషేధిత పదార్థాలు వాటి అనాబాలిక్ లక్షణాలతో పాటు కండరాలు, ఎముకలలో ఆండ్రోజెన్ గ్రాహకాలను ఉత్తేజపరిచే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని కారణంగా క్రీడలలో పనితీరు మెరుగుదలకు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. ఈ నిషేధిత పదార్థం తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాల పెరుగుదల అసాధారణంగా ఉంటుంది.
గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడల్లో పాల్గొన్న ద్యుతీ చంద్.. 200 మీటర్ల పరుగుపందెంలో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 100 మీటర్ల పరుగు ఫైనల్స్‌లో ఆమె ఆరోస్థానంలో నిలిచింది. 2018 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రజతం గెలుచుకున్నది. కాగా, 2013, 2017, 2019 ఆసియా క్రీడల్లో ద్యుతీ కాంస్యం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

