ఖాట్మాండు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య అండర్-19 చాంపియన్‌షిప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 2-1తో భూటాన్‌పై విజయం సాధించింది.
భారత్ తరఫున రికీ, గొయరీ చెరో గోల్ చేయగా.. జిగ్మా భూటాన్‌కు ఏకైక గోల్ అందించాడు. బుధవారం జరుగనున్న సెమీఫైనల్లో ఆతిథ్య నేపాల్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.