Hockey India : భారత హాకీ క్రీడాకారులకు గుడ్‌న్యూస్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాళ్ల కోరిక ఫలించనుంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బంపర్ బొనాంజా ఇవ్వనుంది. జాతీయ క్యాంప్‌నకు ఎంపికైన పురుష, మహిళా ప్లేయర్లకు ప్రతి నెల అదనంగా రూ.25వేలు చెల్లించనుంది.
గురువారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్స్ నెలవారీ సమావేశంలో హాకీ ఇండియా అభ్యర్థనను అంగీకరించిన మంత్రిత్వ శాఖ.. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం కింద ఈ అలవెన్స్ అందజేస్తామని మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా మొత్తంగా 80 మంది (40 మంది పురుషులు, 40 మంది మహిళా క్రీడాకారులు) లబ్ది పొందనున్నారని హాకీ ఇండియా (Hockey India) వెల్లడించింది.
In a first for Indian hockey, the sports ministry has approved an out of pocket allowance of Rs 25,000 per month for players picked in the men’s and women’s national camp.
80 players (40 men and 40 women) will benefit from the allowance which is given to athletes in the… pic.twitter.com/0YK3l7JQqU
— The Bridge (@the_bridge_in) June 20, 2025
హాకీ ప్లేయర్లకు అదనపు భత్యం ఇవ్వాలని హాకీ ఇండియా పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై గురువారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశంలో చర్చ జరిగింది. ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నెల నెలా రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. ఫామ్, ఫిట్నెస్.. ఈ రెండు అంశాల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తాం అని మంత్రి మాండవీయ వెల్లడించారు. అంతేకాదు ఈ సమావేశంలో కోర్ గ్రూప్ అథ్లెట్లకు ప్రతి నెల రూ.50 వేలు ఇవ్వాలని తీర్మానించామని ఆయన తెలిపారు. హాకీ ఆటగాళ్లకు నెలనెలా రూ.25 వేలు ఇవ్వడం కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు ఖర్చు చేయనుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల సంబురాలు
క్రికెటర్ల మాదిరిగానే తమకూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని హాకీ ఆటగాళ్లు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ నెల నెలా రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించడం క్రీడాకారులకు ఎంతగానో ఉపయుక్తం కానుంది. గత కొన్నేళ్లుగా భారత పురుషుల, మహిళల జట్లు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanprit Singh) బృందం.. పారిస్ విశ్వక్రీడల్లోనూ సంచలన ప్రదర్శనతో కంచు మోత మోగించి చరిత్ర సృష్టించింది. అయితే.. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో మాత్రం వరుస వైఫల్యాలతో తీవ్రంగా నిరాశపరుస్తోంది.