Telangana | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫుట్‌బాల్ క్రీడను ప్రోత్సహించడంలో విశేష కృషి, సహకారం అందిస్తున్నందుకు గాను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి ప్రతిష్టాత్మక ‘ఫుట్‌బాల్ ప్రోత్సాహక అవార్డు’ దక్కింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) వార్షిక అవార్డుల దినోత్సవంలో భాగంగా భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చెర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలా దేవీ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది తెలంగాణ ఫుట్‌బాల్‌కు దక్కిన గౌరవమని, రాష్ట్రం లో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.