PKL | గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ అదరగొడుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 41-35తో యూ ముంబాపై అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన టైటాన్స్ తరఫున విజయ్ మాలిక్ (10), అశీష్ నర్వాల్ (10) సూపర్ టెన్షో చేయగా, డిఫెండర్ సాగర్ (5) హైఫైవ్తో ఆకట్టుకున్నాడు. ప్రథమార్ధంలో 25-13తో ఆధి క్యం కొనసాగించిన టైటాన్స్.. ద్వితీయార్ధంలోనూ అదే జోరు ప్రదర్శించింది.