బాన్సువాడ: తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఉప్పల ప్రణీత్‌ను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం అధికారిక నివాసంలో స్పీకర్‌ను ప్రణీత్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. 16 ఏండ్ల ప్రాయంలోనే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ప్రణీత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ర్టానికి మరింత ఖ్యాతి తీసుకురావాలని శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ప్రణీత్ తండ్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యే సీఎం కేసీఆర్..ప్రణీత్‌ను అభినందించడంతో పాటు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన సంగతి తెలిసిందే.