సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 99.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మంగళవారం ఆటలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(49: 177 బంతుల్లో 6ఫోర్లు) బ్యాటింగ్ హైలెట్. తొలి సెషన్ నుంచి భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ జట్టుకు మంచి స్కోరు అందించాడు.
మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా పోరాటస్ఫూర్తితో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో టిమ్ సౌథీ(30: 46 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు)..కేన్‌కు సహకారం అందిస్తూ దూకుడుగా ఆడాడు. టాప్ ఆర్డర్లో డేవన్ కాన్వే(54), టామ్ లాథమ్(30) రాణించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 92.1 ఓవర్లలో 217 పరుగులకే పరిమితమైంది.
Tea in Southampton ☕️
— ICC (@ICC) June 22, 2021
The @BLACKCAPS are all out for 249, taking a lead of 32 runs.#WTC21 Final | #INDvNZ | https://t.co/nz8WJ8f9o4 pic.twitter.com/TxQUkaqK5R