Lhuan-dre Pretorius : అంతర్జాతీయ క్రికెట్లో మరో స్టార్ అవతరించాడు. 19 ఏళ్లకే మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించాడు దక్షిణాఫ్రికా (South Africa) క్రికెటర్ లుహాన్ డ్రె ప్రిటోరియస్ (Lhuan-dre Pretorius). శనివారం జింబాబ్వేతో తొలి టెస్టులో టెస్టులో అరంగేట్రం చేసిన ప్రిటోరియస్.. శతకంతో చెలరేగాడు. తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఉతికేసిన ఈ యంగ్‌స్టర్ 61 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు.
బులావయాలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న ప్రిటోరియస్.. గ్రేమ్ పొలాక్ (Graeme Pollock)ను నెట్టేశాడు. తమదేశం తరఫున చిన్న వయసులోనే మూడంకెల స్కోర్ చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. టీమ్ పరంగా చూస్తే.. మొదటి మ్యాచ్‌లోనే వంద కొట్టిన ఏడో సఫారీ క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకున్నాడీ చిచ్చరపిడుగు. ఈరోజుకు అంటే జూన్ 28 నాటికి ప్రిటోరియస్ వయసు 19 ఏళ్ల 93 రోజులు మాత్రమే. ప్రిటోరియస్ కంటే ముందు తొలి టెస్టులోనే సెంచరీ బాదిన సఫారీలు ఐదుగురు. విల్లగోబై, కొట్జీ, రుడాల్ఫ్, బారీ రిచర్డ్స్, జాక్వెస్ రుడాల్ప్లు తమ మొదటి మ్యాచ్‌లోనే వందతో మురిసిపోయారు.
A debut that just keeps getting better for Lhuan-dré Pretorius! 🧢🔥
What a sublime innings, a sensational maiden Test century filled with grit, class, and total composure! 🇿🇦💯🏏 #WozaNawe pic.twitter.com/tV9zhfs1U4
— Proteas Men (@ProteasMenCSA) June 28, 2025
అండర్ -19 క్రికెట్లో తన బ్యాటింగ్ విన్యాసాలతో అలరించిన ప్రిటోరియస్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. జింబాబ్బే పర్యటనకు ఎంపికైన అతడు తొలి మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన అతడు.. ఐదో స్థానంలో క్రీజులోకి వెళ్లాడు. అప్పటికి 25 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. ఆ దశలో ఒత్తిడిని తట్టుకుంటూ ప్రిటోరియస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో బంతికే సిక్సర్ బాదిన అతడు.. ఆ తర్వాత జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 54 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.
TON ON DEBUT!
Lhuan-dre Pretorius becomes the 7th South African batter to score a hundred on Test debut 👏 🇿🇦
📸: @ProteasMenCSA pic.twitter.com/2GkT34F8Ch
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2025
ఫిఫ్టీ తర్వాత కూడా దూకుడుగా ఆడి112 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో శతకానికి చేరువయ్యాడీ హిట్టర్. దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన సెంచరీ బాదిన ప్రిటోరియస్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అరంగేట్రంలోనే వేగవంతమైన శతకవీరుడిగా అవతరించాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టియాన్ వాన్ జైల్ పేరుతో ఉండేది. 2014లో వెస్టిండీస్‌పై స్టియాన్ 129 బంతుల్లో మూడంకెల స్కోర్ సాధించాడు. 2010లో అల్విరో పీటర్సన్ భారత్‌పై 160 బంతుల్లోనే శతకగర్జన చేశాడు.