Kwena Maphaka: ప్రపంచ క్రికెట్‌కు ఎంతోమంది స్పీడ్ బౌలర్లను అందించిన సౌతాఫ్రికా నుంచి మరో యువకెరటం రాబోతుంది. షాన్పొలాక్, అలెన్ డొనాల్డ్, ముఖాయా ఎన్తిని, ఫిలాండర్, డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, కగిసొ రబాడా, ఆన్రిచ్ నోర్త్జ్తో పాటు తాజాగా నండ్రె బర్గర్ వరకూ ఆ జట్టులో స్పీడ్‌స్టర్లకు కొదవ లేదు. తాజాగా దక్షిణాఫ్రికా యువ పేసర్ క్వెన మఫక సంచలన బౌలింగ్‌తో సఫారీ ఫ్యూచర్ స్టార్ అనిపించుకునేలా చెలరేగాడు. 17 ఏండ్ల మఫక బంతి విసిరిన వేగానికి ఆఫ్ స్టంప్ రెండు ముక్కలైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకెళ్తే.. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ – 19 ట్రై సిరీస్ (ఇండియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్)లో భాగంగా నేడు (సోమవారం) అఫ్గాన్-సఫారీల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. సఫారీ లెఫ్టార్మ్ పేసర్ మఫక.. తొలి ఓవర్లోనే హసన్ ఈసాకిల్ను ఔట్ చేశాడు. తన రెండో ఓవర్లో ఉస్మాన్ ఖాన్‌ను ఔట్ చేసిన మఫక.. ఐదో ఓవర్లో సోహైల్ ఖాన్ జుర్మతి (10)ను బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్ దిశగా మఫక వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ బంతి కాస్తా మిస్ అయి ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. ఈ క్రమంలో బంతి వేగానికి ఆఫ్ స్టంప్ విరిగిపోయి ఒక ముక్క పిచ్ ఆవల ఎగిరిపడింది.
Breaking now: Stumps & Afghan batting line-up 🫢
.
.#SAvAFG pic.twitter.com/OVcku2arwH— FanCode (@FanCode) January 8, 2024
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్.. 45 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. మఫక.. 9 ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. లక్ష్యం దిశగా సాగుతోంది.
ఇటీవలి కాలంలో ఒక బౌలర్ వికెట్ విరగ్గొట్టిన సందర్భాలు అరుదుగా నమోదయ్యాయి. ఐపీఎల్ – 16లో భాగంగా ముంబై – పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్లో వేసిన ఓ యార్కర్‌కు వికెట్ రెండు ముక్కలైంది.