RSA vs NED : టీ20 వరల్డ్ కప్ 16వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa), నెదర్లాండ్స్(Netherlands) అమీతుమీకి సిద్ధమయ్యాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీ సారథి ఎడెన్ మర్క్రమ్ (Aiden Markram) టాస్ గెలిచాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందనే భరోసాతో నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన సఫారీలు రెండో విజయంపై కన్నేశారు. ఇక డచ్ జట్టు బోణీ కొట్టేందుకు ఎదురుచూస్తుంది.
నెదర్లాండ్స్ జట్టు : మైఖేల్ లెవిట్ట్, మాక్స్ ఒడౌడ్డ్, విక్రమ్‌జిత్ సింగ్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెంచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్, వికెట్ కీపర్), బాస్ డీ లీడె, తేజ నిడమనూరు, లొగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగ్లే, పాల్ వాన్ మికీరెన్, వివియన్ కింగ్మా.
దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్జి, ఒట్నిల్ బార్ట్‌మన్.