World Cup Final : వర్షం అంతరాయంతో టాస్ ఆలస్యమైన మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. సాయంత్రం 4:32 గంటలకు టాస్ వేయగా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం ప్రభావంతో తేమ ఉన్నందున టీమిండియాను కట్టడి చేయాలని ఫీల్డింగ్ తీసుకుంది తను. 5 గంటలకు తొలి బంతి పడనుంది.
తొలిసారి విశ్వ విజేతగా నిలిచే సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాలని భారత్, దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉన్నాయి. మూడోసారి ఫైనల్ ఆడుతున్న టీమిండియా ఈసారైనా దశాబ్దాల కలను సాకారం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు నిరుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన సఫారీ టీమ్ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలనే కసితో ఉంది. దాంతో.. ఇరుజట్ల మధ్య ఉత్కంఠ పోరు జరుగనుంది. బిగ్ మ్యాచ్ కావడంతో ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించింది. సఫారీ టీమ్ కూడా సెమీస్‌లో ఆడిన టీమ్‌నే కొనసాగించనుంది.
Both teams unchanged – glory awaits one 🌟#INDvSA LIVE ⏩ https://t.co/30mqjJb2dn pic.twitter.com/kUlBvqXqRh
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2025
భారత తుది జట్టు : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, రేణుకా సింగ్.
దక్షిణాఫ్రికా తుది జట్టు : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), తంజిమ్ బ్రిట్స్, అన్నెకె బాష్, సునే లుస్, మరిజానే కాప్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), అనెరీ డెర్క్సెన్, చ్లో ట్రయాన్, నడినె డీక్లెర్క్, అయబొంగా ఖాక, ఎలంబా.