ఢాకా : బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా తొలి టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఓవర్నైట్ స్కోరు 283/7 వద్ద నాలుగో రోజు ఆట ఆరంభించిన బంగ్లాదేశ్.. సౌతాఫ్రికా పేసర్ రబాడా (6/46) ధాటికి 307 పరుగులకు ఆలౌట్ అయింది. మిరాజ్ (97) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. అనంతరం 106 పరుగుల విజయలక్ష్యాన్ని సౌతాఫ్రికా 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టోనీ డి జార్జి (41), ట్రిస్టన్ స్టబ్స్ (30 నాటౌట్) రాణించారు.