IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్కంఠ కలిగించింది. చివరకు నాలుగు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా.. భారత్‌పై విజయం సాధించింది. అలాగే 3-0 తేడాతో సౌతాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది.
కేవలం ఒకే ఒక్క వికెట్.. ఫైనల్ ఓవర్.. భారత్‌కు 6 పరుగులు కావాలి. ప్రెటోరియస్ చివరి ఓవర్ బౌలింగ్ వేశాడు. క్రీజులో ఉన్న యజువేంద్ర చాహల్‌ను అవుట్ చేసి దక్షిణాఫ్రికాకు విజయం అందించాడు.
కేప్‌టౌన్ వేదికగా జరిగిన థర్డ్ వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 287 పరుగులు చేసి ఆలౌట్ అయి భారత్‌కు 288 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన భారత్.. 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
That's that from the final ODI. South Africa win by 4 runs and take the series 3-0.
— BCCI (@BCCI) January 23, 2022
Scorecard – https://t.co/dUN5jhH06v #SAvIND pic.twitter.com/lqrMH4g0U9
ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను డికాక్ ఆదుకున్నాడు. 130 బంతుల్లో 124 పరుగులు చేశాడు. డుస్సేన్ 52, మిల్లర్ 39 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. భారత బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65, శిఖర్ ధావన్ 61, దీపక్ చాహర్ 54, సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడీ 3 వికెట్లు, అండిలె 3 వికెట్లు, ప్రెటోరియస్ 2, మగాలా, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ తీశారు.
ఇప్పటికే టెస్ట్ మ్యాచ్ లో 2- 1 తో సిరీస్ కైవసం చేసుకున్న సౌతాఫ్రికా.. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా 3 – 0 తేడాతో కైవసం చేసుకుంది.