కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. వర్షం తీవ్ర అంతరాయం కల్గించిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. పాక్‌పై 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసింది. తొలుత వర్షం వల్ల సఫారీ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించగా ఆ జట్టు 312/9 పరుగుల భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ లారా (90), కాప్ (68*) రాణించారు. పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234గా నిర్దేశించగా 20 ఓవర్లలో 83/7కే పరిమితమైంది. ఈ విజయంతో సౌతాఫ్రికా.. 10 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.