సిడ్నీ: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. అయితే 206 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభం నుంచి క్రమక్రమంగా వికెట్లను కోల్పోయింది. ఆ జట్టు 16.3 ఓవర్లలో 101 రన్స్‌కే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జా నాలుగు, షంషి మూడు వికెట్లు తీసుకున్నారు.
South Africa register a thumping win over Bangladesh, clinching two crucial points.#T20WorldCup | #SAvBAN | 📝: https://t.co/Ji9TL3CpQ9 pic.twitter.com/uIxptSdIEK
— ICC (@ICC) October 27, 2022
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు దడదడలాడించారు. రూసో, డీకాక్‌లు చెలరేగి ఆడారు. ఆ ఇద్దరూ రెండో వికెట్లకు 163 రన్స్ జోడించారు. ఇక టీ20ల్లో రూసో రెండవ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లా బౌలర్లను చితకబాదిన రూసో కేవలం 56 బంతుల్లో 109 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు బౌండరీలు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.
డీకాక్ కూడా ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. అతను 38 బంతుల్లో 63 రన్స్ చేశాడు. దాంట్లో ఏడు బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. బవుమా రెండు, స్టబ్స్ ఏడు, మార్క్రమ్ 10 రన్స్ చేసి ఔటయ్యారు.