South Africa : ప్రపంచ క్రికెట్లో గొప్ప పోరాటపటిమ.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఎంతటి మేటి జట్టునైనా చిత్తుచేయగల సామర్థ్యం ఆ టీమ్‌కు ఉంది. కానీ, ఇప్పటికీ ఐసీసీ టోర్నీల్లో వాళ్లను దురదృష్టం, ఫైనల్ ఫోబియా (Final Fobia) వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఉపోద్ఘాతమంతా దక్షిణాఫ్రికా (South Africa) జట్టు గురించే. వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో నాకౌట్ పోరుకు వచ్చేసరికి ఒత్తిడికి చిత్తవ్వడం, కాడి వదిలేయడం.. కన్నీళ్లను దిగమింగలేక భోరుమనడం ఆ దేశ క్రికెటర్లకు పరిపాటి అయింది. గత రెండేళ్లలో ఐదు ఫైనల్స్ చేరినా ఒకేఒక కప్ ఆ జట్టుకు దక్కడమే అందుకు సాక్ష్యం. అవును.. ఆ దేశ పురుషుల జట్టుదే కాదు మహిళల జట్టుదీ అదే వ్యథ, అదే కథ కావడం గమనార్హం.
‘ప్రతిభ ఎంతున్నా ఆవగింజంత అదృష్టం కూడా తోడవ్వాలి’ అనేది నానుడి. దక్షిణాఫ్రికా జట్టుకు ఈ లోకోక్తి అతికినట్టు సరిపోతుంది. ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవకపోవడాన్ని గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. షాన్ పొలాక్, మార్క్ బౌచర్, గ్రేమీ స్మిత్, జాక్వెస్ కలిస్, ఏబీ డివిలియర్స్.. వంటి ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లు సైతం వరల్డ్ కప్ కలను సాకారం చేసుకోలేకపోయారు. అయితే.. గత రెండేళ్లలో సఫారీ పురుషుల, మహిళల జట్టు ఏకంగా ఐదు ఫైనల్స్ ఆడాయి. కానీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మాత్రమే విజయం వరించింది.
Third time’s not a charm for the South African women’s team 🇿🇦 pic.twitter.com/6qA9yuDYhK
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2025
రెండేళ్ల క్రితం న్యూజిలాండ్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సంచలన ఆటతో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ చేరింది. ఒక కప్ కొట్టడమే బాకీ అనుకున్న వేళ ఆస్ట్రేలియా నిర్దేశించిన 157 పరుగుల ఛేదనలో 137కే పరిమితమై కప్‌ను వదిలేసింది. అదే ఏడాది పురుషులు జట్టు వన్డే ప్రపంచ కప్ సెమీస్ దాటలేకపోయిది. నిరుడు ఎడెన్ మర్క్రమ్ సారథ్యంలో అదరగొట్టిన సఫారీ టీమ్ కలల కప్‌ను ఒడిసిపట్టేలా కనిపించింది. అయితే.. బార్బడోస్ వేదికగా జరిగిన భారత్‌తో టైటిల్ పోరులో హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) హాఫ్ సెంచరీతో విజయానికి చేరువైంది కూడా. కానీ, డెత్ ఓవర్లలో వరసగా వికెట్లు కోల్పోయి 7 పరుగుల తేడాతో కప్‌ను చేజార్చుకుంది. అబ్బాయిలు వదిలేశారు సరే అమ్మాయిలైనా పట్టేస్తారనుకుంటే న్యూజిలాండ్‌కు అప్పగించేశారు.
The wait continues for South Africa to summit the white-ball stage pic.twitter.com/FvZQfT1Ycg
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2025
ఉత్కంఠ రేపిన ఫైనల్లో అమేలియా కేర్ (Amelia Kerr) ఆల్‌రౌండ్ షోతో సఫారీ మహిళల జట్టుకు గుండెకోతను మిగిల్చింది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌తోనే మర్క్రమ్ సేన కథ ముగిసింది. అయితే.. సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆ జట్టు కొత్త చరిత్రను లిఖించింది. లార్డ్స్‌లో జరిగిన టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో తెంబా బవుమా (Temba Bavuma) సారథ్యంలోని దక్షిణాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్‌కు చెక్ పెట్టింది. టెస్టు గద(Test Mace)ను అందుకొని ఐసీసీ విజేతగా మురిసిపోయింది. దాంతో.. ఈసారి వన్డే ప్రపంచ కప్‌ను మహిళల జట్టు గెలుపొందడం ఖాయమని ఆ దేశపు అభిమానులు గట్టిగానే నమ్మారు.
They’ve done it! South Africa are WTC Champions! 🏆🇿🇦
27 years of waiting ends in glory 🥺❤
A moment for the ages and for every fan who never stopped believing#SouthAfrica #WTCFinal pic.twitter.com/gShxDKkA3n
— Star Sports (@StarSportsIndia) June 14, 2025
సూపర్ ఫామ్‌తో మెగా టోర్నీలో అడుగుపెట్టిన లారా వొల్వార్డ్త్ బృందం తొలి మ్యాచ్‌లో 69కే ఆలౌటైంది. ఆ ఘోర పరాభవం నుంచి తేరుకొని వరుసగా ఐదు విజయాలతో సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఇక చివరి మ్యాచ్‌ను విజయంతో లీగ్ దశను ముగించాలనుకున్న ఆ జట్టుకు ఆస్ట్రేలియా పెద్ద షాకిచ్చింది. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలతో భారీ ఓటమిని అందించింది. అయినా సరే ఏమాత్రం సెమీ ఫైనల్లో తడబడకుండ బలమైన ఇంగ్లండ్‌పై సూపర్ విక్టరీ కొట్టింది దక్షిణాఫ్రికా.
Laura Wolvaardt, TAKE A BOW 🙇 pic.twitter.com/weVTLApINB
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2025
కెప్టెన్ లారా భారీ శతకం(169)తో పెద్ద స్కోర్ అందించగా.. మరిజానే కాప్ నాలుగు వికెట్లతో జట్టను ఫైనల్ చేర్చింది. ఇక టైటిల్ పోరులో భారత్‌ను 298కే కట్టడి చేసిన సఫారీలు.. లారా సెంచరీతో విజయం వాకిట నిలిచారు. కానీ, దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ఆ జట్టు కప్ కలను భగ్నం చేసింది. డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం టీమిండియా చేతిలో 52 పరుగుల ఓటమి లారా బృందానికి మర్చిపోలేని హార్ట్ బ్రేక్ కానుంది.
Laura Wolvaardt finished a class above the rest 💪 pic.twitter.com/4iPFUy6WgR
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2025