సెంచూరియన్(దక్షిణాఫ్రికా): పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించారు. పాక్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.3 ఓవర్లలో 210/3 స్కోరు చేసింది. ఓపెనర్ రెజా హెండ్రిక్స్(63 బంతుల్లో 117, 7ఫోర్లు, 10సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో కదంతొక్కాడు.
ఛేదనలో 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో డస్సెన్(38 బంతుల్లో 66 నాటౌట్, 3ఫోర్లు, 5సిక్స్‌లు)తో కలిసి హెండ్రిక్స్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశాడు. వీరిద్దరు కలిసి పాక్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హెండ్రి క్స్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 7ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో టీ20ల్లో హెండ్రిక్స్ తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఖాన్(2/40) రెండు వికెట్లు తీశాడు. తొలుత సయిమ్ ఆయూబ్(98 నాటౌట్) రాణించడంతో పాక్ 20 ఓవర్లలో 206/5 స్కోరు చేసింది. రెండు పరుగుల తేడాతో ఆయూబ్ సెంచరీ చేజార్చుకున్నాడు. గాలిమ్, బార్ట్‌మన్ రెండేసి వికెట్లు తీశారు. హెండ్రిక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
2 దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ గెలువడం గత రెండేండ్లలో ఇది తొలిసారి. చివరిసారి ఆగస్టు 2022లో గెలిచింది.
1 ఇరు జట్ల మధ్య ఒక టీ20 పోరులో స్కోర్లు 416 నమోదు కావడం ఇదే తొలిసారి.