సెంచూరియన్: స్వదేశంలో పాకిస్థాన్‌తో ఆడుతున్న తొలి టెస్టు మొదటి రోజే మ్యాచ్‌పై దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన సఫారీలు.. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ను 211 పరుగులకే కుప్పకూల్చారు. డేన్ పీటర్సన్ (5/61) ఐదు వికెట్లతో చెలరేగగా కార్బిన్ బోష్ (4/63) పాక్ బ్యాటర్ల ఆట కట్టించారు. కమ్రన్ గులామ్ (54) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.