SA20 : ఐపీఎల్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీ క్రికెట్(Franchise Cricket) టోర్నీల పుణ్యమా అని పొట్టి ఫార్మాట్‌కు పిచ్చ క్రేజ్ వచ్చేసింది. ఏడాదంతా ఏదో ఒక లీగ్ జరుగుతూనే ఉంది. కొత్త ఏడాది ఆరంభంలోనే క్రికెట్ సందడిని షురూ చేసేందుకు దక్షిణాఫ్రికా టీ20(SA20) లీగ్ సిద్ధమైంది. అవును.. ఈ లీగ్ మూడో సీజన్ జనవరి 9న మొదలవ్వనుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఫైనల్ ఫైట్‌తో మూడో సీజన్ ముగియనుంది. ఈ విషయాన్ని శుక్రవారం సౌతాఫ్రికా లీగ్ వెల్లడించింది.
‘రెండు సీజన్లు విజయవంతం కావడంతో దక్షిణాఫ్రికా లీగ్ మూడో సీజన్‌కు ప్లాన్ చేస్తున్నాం. కిక్కిరిసిన స్టేడియాల్లో లేదంటే టీవీల్లో.. ప్రపంచ క్రికెట్లోని స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేందుకు ఇదొక మంచి చాన్స్’ అని దక్షిణాఫ్రికా లీగ్ కమిషనిర్ గ్రేమ్ స్మిత్(Graeme Smith) తెలిపాడు.
𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨
𝑴𝒂𝒓𝒌 𝒕𝒉𝒐𝒔𝒆 𝒄𝒂𝒍𝒆𝒏𝒅𝒂𝒓𝒔 🗓️ #Betway #SA20 Season 3⃣ comes your way 𝐟𝐫𝐨𝐦 𝟗 𝐉𝐚𝐧𝐮𝐚𝐫𝐲 𝟐𝟎𝟐𝟓 💪🏏 pic.twitter.com/n23EjM6vPr
— Betway SA20 (@SA20_League) June 7, 2024
అంతేకాదు త్వరలోనే మూడో సీజన్ వేలం తేదీలు, ఆక్షన్‌లో పాల్గొనే ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తామని స్మిత్ చెప్పుకొచ్చాడు. అయితే.. 2025 జనవరిలోనే ఇంటర్నేషనల్ లీగ్20, బిగ్‌బాష్ లీగ్(Big Bash League) కూడా జరుగనున్నాయి. దాంతో, ఈసారి మూడు టీ20 లీగ్స్ మ్యాచ్‌లు ఏకకాలంలో అభిమానులను అలరించనున్నాయి.
దక్షిణాఫ్రికా 20 తొలి సీజన్ నుంచి ఆరు జట్లు పోటీపడుతున్నాయి. ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జొబర్గ్ సూపర్ కింగ్స్, పార్స్ రాయల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape), ఎంఐ కేప్‌టౌన్ జట్లు మూడో సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. కానీ, ఈ టోర్నీలో రెండు సీజన్లలో సన్‌రైజర్స్ జట్టే విజేతగా నిలిచింది.
𝐕𝐎𝐓𝐄 𝐕𝐎𝐓𝐄 𝐕𝐎𝐓𝐄 ✅
𝑴𝒂𝒓𝒄𝒐 𝑱𝒂𝒏𝒔𝒆𝒏 and 𝑶𝒕𝒕𝒏𝒊𝒆𝒍 𝑩𝒂𝒂𝒓𝒕𝒎𝒂𝒏 topped the #Betway #SA20 wicket-taking charts.
𝐶𝑎𝑠𝑡 𝑦𝑜𝑢𝑟 𝑣𝑜𝑡𝑒 ℎ𝑒𝑟𝑒 𝑖𝑓 𝑡ℎ𝑒𝑦 𝑤𝑒𝑟𝑒 𝑦𝑜𝑢𝑟 𝑓𝑎𝑣𝑜𝑢𝑟𝑖𝑡𝑒 🔗 https://t.co/skCtRKESIy pic.twitter.com/BTKAY3Qk5V
— Betway SA20 (@SA20_League) May 28, 2024
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో 2024 ఎడిషన్ ఆడిన సన్‌రైజర్స్.. ఎడెన్ మర్క్రమ్ సారథ్యంలో రెండోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. డర్బన్ సూపర్ జెయింట్స్(Durban Super Giants)ను ఫైనల్లో చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో 89 పరగుల తేడాతో గెలుపొందింది.