అమరావతి : గుడివాడ తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ఇంటిపై తెలుగు యువత శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం కొంత మంది యువకులు కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి రాళ్లు, కోడిగుడ్ల (Eggs) తో దాడి చేశారు. ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇచ్చిన మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. వైసీపీ ఐదేండ్ల పాలనలో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన సమయంలో కొడాలి నాని టీడీపీ, జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. అనేకసార్లు తిట్ల దండకంతో వార్తల్లో నిలిచారు. చంద్రబాబును, లోకేష్, పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం ప్రచారంలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం(Political asceticism) తీసుకుంటానని ప్రత్యర్థులకు సవాల్ చేశారు. 2014,2019లో వైసీపీ తరుఫున పోటీ చేసి గెలిచిన నాని మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాము చేతిలో ఓడిపోయారు.