WTC Winner : ప్రతష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా (South Africa) విజయగర్జన చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్బుత విజయంతో తొలిసారి ఐసీసీ ట్రోఫీలో ఛాంపియన్‌గా అవతరించింది. తెంబ బవుమా (Temba Bavuma) సారథ్యంలోని సఫారీ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. తమ 27 ఏళ్ల కలకు రూపమిచ్చింది. డబ్ల్యూటీసీ మూడో సీజన్లో సూపర్ విక్టరీతో చరిత్ర సృష్టించింది. ఆసీస్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది ప్రొటిస్ టీమ్. అంతే.. లారడ్స్లో అద్భుత ఘట్టం అవిష్కృతమైంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చెమర్చిన కళ్లతో, ఉప్పొంగిన హృదయాలతో మేము సాధించాం అని సంబురాలు చేసుకున్నారు.
జూన్ 14.. దక్షిణాఫ్రికాక్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఇక్కడ ఇప్పటివరకూ రెండు పర్యాయాలు మాత్రమే సాధ్యమైన 280 ప్లస్ లక్ష్య ఛేదన రికార్డును సఫారీ జట్టు బ్రేక్ చేసింది. తమ ఆటకు తిరుగులేని చాటుతూ కంగారూలు నిర్దేశించిన భారీ టార్గెట్‌ను ఉఫ్‌మని ఊది పడేసింది. తొలి రెండు రోజులు కమిన్స్ సేన పట్టుబిగించినా.. సంకల్పం సడలించని సఫారీలు మూడో రోజు నుంచి మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
ICC World Test Champions 2025!#WtcFinal2025 #Proteas pic.twitter.com/LJnsfdHnhu
— Captain Springbok (@CaptSpringbok) June 14, 2025
ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(136), కెప్టెన్ తెంబ బవుమా(66) బ్యాటుతో రాణించగా.. 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐసీసీ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది దక్షిణాఫ్రికా. స్టార్క్ బౌలింగ్‌లో కైలీ వెర్రినే విన్నింగ్ షాట్ కొట్టగానే సఫారీ డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి. అనంతరం ఐసీసీ ఛైర్మన్ జై షా చేతుల మీదుగా బవుమా టెస్టు గదను అందుకున్నాడు. సహచరుల జయజయధ్వానాల మధ్య అతడు గదను రెండు చేతులతో పైకి ఎత్తి మేము ఛాంపియన్లం అని ప్రపంచానికి చాటాడు.
Glory for the Rainbow Nation! 🇿🇦🏆 pic.twitter.com/nsRj44guQz
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2025
ఆ చిరస్మరణీయ క్షణాల్ని తమ ఫోన్లలో బంధిస్తూ తెగ మురిసిపోయారు అభిమానులు. ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ విజయాన్ని దగ్గరుండి వీక్షించిన డీవిలియర్స్.. ఈసారి తమ జట్టు గెలుపు సంబురాలను ఫోన్లో చిత్రీకరిస్తూ కనిపించాడు.