Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరుతో అఫైర్ నడుపుతుందంటూ కొద్ది రోజులుగా రూమర్లు జోరందుకొన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి బయటి ప్రపంచానికి చెప్పడానికి సమంత నిర్మించిన శుభం సినిమా చక్కటి వేదికగా నిలిచింది. వారిద్దరి కెమిస్ట్రీ సినిమా ప్రమోషన్ సమయంలో స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. సమంత రాజు నిడుమోరు భుజంపై వాలిన ఫొటో అయితే సంచలనంగా మారింది. ఆ సమయంలో రాజు నిడుమోరు భార్య శ్యామల షేర్ చేసిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
నా గురించి మాట్లాడేవారికి, నా తరఫున మాట్లాడేవారికి, నేను చెప్పేది వినేవారికి, నా గురించి రాసే వారికి, నా కోసం ఆలోచించేవారందరికీ దేవుడు ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రాజు నిడుమోరు భార్య శ్యామల ఒక కొటేషన్ పేర్ చేసింది. ఆ తర్వాత మంచి కర్మను సృష్టించండి.. ప్రజలకు సాయం చేయండి..నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి అనే కొటేషన్‌తో కూడిన ఉన్న ఫొటోను షేర్ చేసింది. సమంత, రాజు నిడుమోరుకు శ్యామల కౌంటరిచ్చిందనే అంతా భావించారు.
ఇక ఈ పరిస్థితుల నడుమ సమంత పెట్టిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిశ్శబ్ధంగా ఒకరిని మెచ్చుకోకూడదు. ఎవరినైన ఆరాధిస్తే కచ్చితంగా వారికి చెబుతాను. మనం మనుషులం చాలా పెళుసుగా ఉంటాము. ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవడం నేర్చుకోవాలి. నిశ్చబ్ధంగా ఒకరిని ఆరాధించకండి అని సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ కొటేషన్ చూసిన నెటిజన్స్ రాజ్ భార్యని ఉద్దేశించే పెట్టిందని కామెంట్ చేశారు.ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే సినిమాలో నటిస్తున్న సమంత ఇటీవల ‘శుభం’ అనే చిత్రంతో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరిసిన సమంత, ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆమె అభిమానులకు హామీ ఇచ్చారు.