న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తమ గ్రూపు ప్రస్థానాన్ని అజేయంగా ముగించింది. బుధవారం జరిగిన పోరులో సఫారీలు 6 వికెట్ల తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించింది. అవకాశాలను అనుకూలంగా మలుచుకుంటూ కార్బన్ బాశ్(3/12), నోకియా(2/28) ధాటికి యూఏఈ 20 ఓవర్లలో 122/6 స్కోరు చేసింది.
అలీషాన్ షరాఫ్(45) ఒక్కడే ఫర్వాలేదనిపించగా, మిగతావారు పూర్తిగా తేలిపోయారు. 38 బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆకట్టుకున్న అలీషాన్ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మ్యాచ్ మొత్తంగా సఫారీ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు విడిచిపెట్టి యూఏఈ బ్యాటర్లకు చాన్స్ ఇచ్చారు. స్వల్ప లక్ష్యాన్ని సఫారీలు 13.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.
బ్రెవిస్(36), రికల్టన్(30) దూకుడుగా ఆడారు. ఓపెనర్లు మార్క్మ్(్ర28), డికాక్(14) జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించారు. కెప్టెన్ మార్క్మ్.్ర.యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.బ్రెవిస్, రికల్టన్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.