కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో ఇవాళ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఆ జట్టులో కీలక ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ లేడు. గాయం వల్ల క్లాసెన్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఎడమ మోచేతి గాయంతో అతను ఇబ్బందిపడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి ఆడుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌కు హస్మతుల్లా షాహిది కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్‌లో పాక్‌పై న్యూజిలాండ్, సెకండ్ మ్యాచ్‌లో బంగ్లాపై ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే.
A solid start from Rickelton and South Africa! 💪🇿🇦
The first over is completed; SA is 4/0.#WozaNawe #BePartOfIt #ChampionsTrophy #AFGvSA
— Proteas Men (@ProteasMenCSA) February 21, 2025