గిబెరా: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్‌ను 2-0 తేడాతో సఫారీలు కైవసం చేసుకున్నారు. సెయింట్ జార్జ్ పార్క్‌లో జరిగిన మ్యాచ్(SAvSL)లో 348 రన్స్ టార్గెట్‌లో లంక రెండో ఇన్నింగ్స్ చేపట్టింది. ఇవాళ అయిదో రోజు 143 రన్స్ చేయాల్సి ఉండగా, చివరి అయిదు వికెట్లను లంక త్వరగా కోల్పోయింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా, కుశాల్ మెండిస్ కొంత సేపు ప్రతిఘటించినా.. చివరకు శ్రీలంక 238 రన్స్ వద్ద లంచ్‌కు ముందే ఆలౌటైంది.
స్పిన్నర్ కేశ్ మహారాజ్.. ఈ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీశాడు. టెస్టుల్లో అయిదేసి వికెట్లు తీయడం అతనికి ఇది 11వసారి. సిరీస్‌ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో తన పొజిషన్ మెరుగుపరుచుకున్నది. 63.33 పాయింట్లతో ఐసీసీ స్టాండింగ్స్ లిస్టులో సౌతాఫ్రికా ప్రస్తుతం ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలుచున్నది.
Australia’s reign at the top of the #WTC25 standings was short-lived as new leaders emerge after South Africa’s whitewash of Sri Lanka 👀 #SAvSL | Details 👇
— ICC (@ICC) December 9, 2024