WTC Final 2025 | ఆస్ట్రేలియాతో టెస్టు గద సమరం.. సఫారీ సైన్యంలో ఐపీఎల్ హీరోలు..!
WTC Final 2025 : ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2025)కు సమయం దగ్గరపడుతోంది. ఇంకా 29 రోజులే ఉంది. దక్షిణాఫ్రికా సెలెక్టర్లు సైతం తెంబ బవుమా (Temba Bavuma) సారథిగా తమ సైన్యాన్ని ఖరారు చేశారు.
WTC Final 2025 : ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2025)కు సమయం దగ్గరపడుతోంది. ఇంకా 29 రోజులే ఉంది. టెస్టుల్లో వరల్డ్ కప్‌గా పేరొందిన ఈ పోరు కోసం ఆస్ట్రేలియా (Australia), దక్షిణాఫ్రికా (South Africa) అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆసీస్ బోర్డు తమ రేసుగుర్రాలతో జాబితాను ప్రకటించింది. దక్షిణాఫ్రికా సెలెక్టర్లు సైతం తెంబ బవుమా (Temba Bavuma) సారథిగా తమ సైన్యాన్ని ఖరారు చేశారు. ఆసీస్ సవాల్‌ను కాచుకొనేందుకు 15 మందితో కూడిన బలమైన బృందాన్ని ఇంగ్లండ్ పంపనున్నారు.
ఐపీఎల్ 18వ సీజన్లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన సఫారీ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టుకు ఎంపికయ్యారు. వికెట్ ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా అలరించిన రియాన్ రికెల్టన్(Ryan Rickeleton), లక్నో తరఫున దంచి కొట్టిన ఎడెన్ మర్క్రమ్(Aiden Markram), ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొండంత ఆస్తిలా మారిన ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs)లకు టెస్టు గద టైటిల్ పోరు స్క్వాడ్‌లో చోటు దక్కింది.
Proteas Men’s head coach Shukri Conrad has today announced the 15-player squad for the highly anticipated ICC World Test Championship (WTC) Final against Australia, taking place from 11 – 15 June at Lord’s Cricket Ground in London.
Temba Bavuma will lead the side, with the pace… pic.twitter.com/e76WCrd2zl
— Proteas Men (@ProteasMenCSA) May 13, 2025
పంజాబ్ కింగ్స్ తరఫున అదరగొట్టిన ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్.. సీనియర్ పేసర్ లుంగి ఎంగిడి, రబడలతో సఫారీ పేస్ దళం పటిష్ఠంగా కనిపిస్తోంది. అయితే.. స్క్వాడ్‌లో చోటు ఆశించిన పేసర్ అన్రిచ్ నోర్జి, గెరాల్డ్ కొయెట్జీ, నంద్రే బర్గర్లకు మాత్రం చుక్కెదురైంది.
దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ స్క్వాడ్ : తెంబ బవుమా(కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, కార్బిన్ బాస్చ్, టోనీ డి జోర్జి, ఎడెన్ మర్క్రమ్, వియాన్ మల్డర్, డేన్ పీటర్సన్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కిలే వెర్రెన్నే. మార్కో యాన్సెస్, కేశవ్ మహరాజ్, సెనురన్ ముతుస్వామి, లుంగి ఎంగిడి, కగిసో రబడ.
స్టబ్స్, రికెల్టన్

ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11న డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవ్వనుంది. ఆస్ట్రేలియాకు ఇది రెండో ఫైనల్ కాగా.. సఫారీలకు మొదటిది. రెండేళ్ల క్రితం ఓవల్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాకు షాకిచ్చి టెస్టు గదను తన్నుకుపోయిన ఆసీస్.. ఈసారి అదే వ్యూహంతో బవుమా బ్యాచ్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది.

అయితే.. తొలి ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకునేందుకు సఫారీ సైన్యం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. నిరుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో కుంగిపోయిన దక్షిణాఫ్రికా సుదీర్ఘ ఫార్మాట్లో విజేతగా నిలవాలనే కసితో ఉంది. బలాబలాల పరంగా ఇరుజట్లు సమానంగా కనిపిస్తున్నా.. ఒత్తిడిని జయించిన వాళ్లనే విజయం వరించనుంది.
ఇవి కూడా చదవండి
- IPL 2025 | అహ్మదాబాద్‌లో ఫైనల్.. ప్లే ఆఫ్స్ ఎక్కడంటే..?
- Sarpatta Parambarai | ‘సర్పట్ట పరంబారై’కి సీక్వెల్ రాబోతుంది : ఆర్య
- Election Commission: డుప్లికేట్ ఓటర్ ఐడీకార్డుల సమస్యను పరిష్కరించాం: ఎన్నికల సంఘం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

