న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఎపిక్ నెంబర్లు.. ఓటరు ఐడీ నెంబర్లకు చెందిన 20 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించినట్లు ఈసీఐ తెలిపింది. డూప్లికేట్ ఓటర్ ఐడెంటిటీ కార్డు నెంబర్ల సమస్యను పరిష్కరించినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. 2005 నుంచి వివిధ రాష్ట్రాలు.. ఓవర్లాపింగ్ ఆల్ఫాన్యూమరిక్ సిరీస్ను వాడుతోంది. దీని వల్ల ఆ సమస్య ఉత్పన్నమైనట్లు ఈసీ చెప్పింది. అయితే దేశవ్యాప్తంగా సుమారు 99 కోట్ల ఓటర్ల ఐడీ కార్డులను వెరిఫికేషన్ చేశామన్నారు. వీటిల్లో చాలా తక్కువ సంఖ్యలో డూప్లికేట్ ఓటర్ ఐడీ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే ఆ కేసులన్నీ వాస్తవమైనవే అని, ఆ ఓటర్లకు అందరికీ కొత్త, విశిష్టమైన ఎపిక్ నెంబర్లతో ఐడీలు జారీ చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. డూప్లికేట్ ఓటరు ఐడీ కార్డులతో ఓటింగ్లో ఎటువంటి సమస్య రాలేదని ఈసీ చెప్పింది. ఎందుకంటే సంబంధింత పోలింగ్ స్టేషన్లోనే ఓట్లు వేయడం వల్ల సమస్య రాలేదన్నది.