జోహన్నెస్‌బర్గ్: వచ్చేనెల 14 నుంచి భారత్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న దక్షిణాఫ్రికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచాక ఎడమ కాలిగాయంతో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులకు దూరమైన కెప్టెన్ టెంబా బవుమా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఉపఖండపు పిచ్‌లకు అనుగుణంగా సౌతాఫ్రికా.. ముగ్గురు స్పిన్నర్లను జట్టులో చేర్చింది.
స్పిన్ విభాగానికి కేశవ్ మహారాజ్ సారథ్యం వహించనుండగా సెనురన్ ముత్తుస్వామి, సైమన్ హార్మర్ తుది జట్టులో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక బవుమా రాకతో డేవిడ్ బెడింగ్హమ్ జట్టుకు దూరమవ్వగా పాకిస్థాన్ జట్టుతో ఆడిన సభ్యులే భారత్‌తో సిరీస్‌లోనూ ఉన్నారు. నవంబర్ 14-18 మధ్య కోల్‌కతాతో తొలి టెస్టు, 22-26 మధ్య గువహతితో రెండో టెస్టు జరుగనుంది.
సౌతాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), బాష్, బ్రెవిస్, టోని డి జోర్జి, జుబైర్ హమ్జా, హార్మర్, యాన్సెన్, మహారాజ్, మార్క్మ్,్ర మల్డర్, ముత్తుస్వామి, రబాడా, రికెల్టన్, స్టబ్స్, వెరియానె.