కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. గురువారం అతడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గా ను దాదా బుర్దాన్ యూనివర్సిటీకి వె ళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తమ ముందు వెళ్తున్న ఓ లారీని ఓవర్ టేక్ చేయబోతుండగా కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేకులు వేయడంతో కాన్వాయ్‌లోని కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగానే బయటపడ్డారని బెంగాల్ పోలీసులు తెలిపారు.