ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ 50వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటన సందర్భంగా లండన్‌లో ఉన్న గంగూలీ.. ఇక్కడి ప్రఖ్యాత ‘లండన్ ఐ’ వద్ద డ్యాన్స్ చేస్తూ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు.
తన ఆప్తులు, కుటుంబ సభ్యులతో కలిసి గంగూలీ ఇలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్య దోనా, కూతురు సనా ముందు గంగూలీ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. వీరితోపాటు క్రికెట్ గాడ్‌గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కూడా ఆ బృందంలో ఉండటం గమనార్హం. వీళ్లిద్దరూ చాలాకాలం కలిసి క్రికెట్ ఆడారు.
Sourav Ganguly Celebrating 50th B'day dancing Midnight with daughter Sana & Wife Dona Ganguly in London.@SGanguly99 #HappyBirthdayDada #BCCI #SouravGanguly #SouravGangulybirthday #birthday #Cricket #Dada pic.twitter.com/DO5sNr3bKy
— Vineet Sharma (@Vineetsharma906) July 8, 2022