Sophie Ecclestone : మహిళా క్రికెట్లో ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్(Sophie Ecclestone) చరిత్ర సృష్టించింది. వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పాకిస్థాన్ (Pakistan)తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో సోఫీ ఈ ఫీట్ సాధించింది. డేంజరస్ నష్రా సంధు(Nashra Sandhu)ను ఔట్ చేసి వందో వికెట్ ఖాతాలో వేసుకుంది.
ఈ ఆల్‌రౌండర్ 63 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయికి చేరుకొని.. ఆస్ట్రేలియా బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ (Cathryn Fitzpatrick) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఫాస్ట్ బౌలర్ అయిన క్యాథిరన్ 64 ఇన్నింగ్స్‌ల్లో వంద వికెట్లతో మెరిసింది. కౌంటీ గ్రౌండ్లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 302 రన్స్ కొట్టింది. నాట్ సీవర్ బ్రంట్(124 నాటౌట్) సెంచరీతో కదంతొక్కగా.. అలిసే క్యాప్సే(39 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించింది.
Nat Sciver-Brunt starred with bat and ball as England beat Pakistan in the third and final ODI to complete a 2-0 series victory 👏#ENGvPAK 📝: https://t.co/pJFejtJeDC pic.twitter.com/uFuDOojd2E
— ICC (@ICC) May 29, 2024
అనంతరం భారీ ఛేదనలో సోఫీ తిప్పేసింది. మునీబా అలీ(47) వికెట్‌తో వేట మొదలెట్టిన ఆమె.. అలియా రియాజ్(36), నశ్రా సంధు(0)ను ఔట్ చేసింది. 4.1 ఓవర్లలో సోఫీ 15 పరుగులే ఇచ్చి మూడు ఇకెట్లు తీయడంతో ఇంగ్లండ్ 178 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, హీథర్ నైట్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
💯 for Sciver-Brunt 👏
💯 ODI wickets for Ecclestone 👏
🎥 3rd ODI Match Highlights 👇 pic.twitter.com/R5Hnf1n5eK— England Cricket (@englandcricket) May 30, 2024