Lava Yuva 5G | ఒక్టాకోర్ యూనిసోక్ టీ750 ప్రాసెసర్‌తో తొలి స్మార్ట్ ఫోన్ లావా యువ 5జీ.. ధరెంతంటే..?!
Lava Yuva 5G | లావా ఇంటర్నేషనల్ నుంచి రూ.10 వేల లోపు ధరకే మరో స్మార్ట్ ఫోన్ ‘లావా యువ 5జీ’.. భారత్ మార్కెట్లోకి వచ్చేసింది.
Lava Yuva 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ తన లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ750 ప్రాసెసర్‌తో మార్కెట్లోకి వస్తున్న తొలి ఫోన్ ఇది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ ప్లే కలిగి ఉంటుంది. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
లావా యువ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,4999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999లకు లభిస్తాయి. మైస్టిక్ బ్లూ, మైస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, లావా ఈ-స్టోర్, రిటైల్ ఔట్లెట్లలో లభిస్తుంది. ఒక ఏడాది వారంటీ ఆఫర్ చేస్తోంది.
లావా యువ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. రెండేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్, ఆండ్రాయిడ్ 14 అప్ గ్రేడ్ చేస్తుంది. 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.52-అంగుళాల హెచ్డీ+ (720×1600 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. టాప్ సెంటర్లో 2.5డీ కర్వ్డ్ డిస్ ప్లేపై హోల్ పంచ్ కటౌట్ ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ750 ఎస్వోసీ ప్రాసెసర్‌పై పని చేస్తుందీ ఫోన్. 4జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్లో అదనపు స్టోరేజీ కోసం 8జీబీ మెమొరీ పెంచుకోవచ్చు.
లావా యువ 5జీ ఫోన్ 128 జీబీ స్టోరేజీ కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. 4జీ వోల్ట్, బ్లూటూత్ 5, జీఆర్పీఎస్, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, మ్యాగెటో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాకింగ్‌కు మద్దతుగా నిలుస్తుంది. 18వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 28 గంటల టాక్ టైం ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

