ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఐపీఎల్లో ముంబై జట్టులోని పాండ్యా బ్రదర్స్ ఇద్దరూ ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృనాల్ చాలా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయినా అతన్ని ప్రతి మ్యాచులో తీసుకోవడంపై పలువురు నెటిజన్లు ముంబై జట్టు యాజమాన్యాన్ని నిందిస్తున్నారు. ముంబై జట్టులో చాలామంది బ్యాట్స్‌మెన్ ఫామ్ లేక తంటాలు పడుతున్నారు. వారిలో కృనాల్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో కూడా ఢిల్లీ చేతిలో ముంబై జట్టు పరాజయం పాలైంది.
ఈ మ్యాచులో 15 బంతులు ఎదుర్కొన్న కృనాల్ 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం 20 ఓవర్లు ఆడిన ముంబై జట్టు కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు సునాయాసంగా ఛేదించింది. బౌలింగ్‌లో కూడా కృనాల్ పెద్దగా రాణించలేదు. 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇప్పటి వరకూ ముంబై జట్టు ఆడిన 12 మ్యాచులూ ఆడిన కృనాల్ కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. ఈ లీగ్‌లో అతని యావరేజ్ 14.88 కాగా, బౌలింగ్‌లో ఎకానమీ రేట్ 7.74గా ఉంది.
ఢిల్లీతో మ్యాచులో చివరి ఓవర్లో 4 పరుగులు కావాల్సిన తరుణంలో బంతి కృనాల్‌కు ఇచ్చాడు కెప్టెన్ రోహిత్. ఆ ఓవర్ తొలి బంతికే సిక్సర్ సమర్పించుకున్న కృనాల్ ఆ రకంగా మ్యాచ్ ముగించాడు. దీంతో చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై మీమ్స్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. కృనాల్ మంచి బ్యాట్స్‌మెన్ అని, కాకపోతే భారతీయ బౌలర్లను, విదేశీ బౌలర్లను మాత్రమే ఎదుర్కోలేడని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
#Krunalpandya is a brilliant batsman 😘🤩…He Just Struggle Against Playing Indian And Foreigner Bowling..Baaki Sab First Class Hai Kasam Se Baaki Sab Hai First Class😍 pic.twitter.com/fM7qm3KkNJ
— Hitman fan forever (@Rohitfanforever) October 2, 2021
Lord krunal Pandya after scoring zero runs in 7 balls. Legend for a reason
— वीर सपूत 🇮🇳 (@supermanmahirat) October 2, 2021
#MIvsDC pic.twitter.com/Oj08HdIpsE