ముంబై: ఎదురుగా వేలంలో రూ.16.25 కోట్లు పలికిన ఆటగాడు ఉన్నాడు. మంచి ఫినిషర్ అన్న ఉద్దేశంతోనే ఐపీఎల్‌లోనే అత్యధిక ధర పెట్టి మరీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ క్రిస్ మోరిస్‌ను కొనుగోలు చేసింది. అయినా ఆ టీమ్ కెప్టెన్ సంజు శాంసన్‌కు అతనిపై ఆ మాత్రం నమ్మకం లేదా? ఇదీ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అభిమానులు అడుగుతున్న ప్రశ్న. ఈ మ్యాచ్‌లో శాంసన్ సెంచరీ కొట్టినా టీమ్‌ను గెలిపించుకోలేకపోయాడు.
అయితే చివరి ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీయడానికి శాంసన్ నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండు బంతుల్లో ఐదు పరుగులు కావాల్సి ఉండగా.. ఐదో బంతికి శాంసన్ సింగిల్ తీయలేదు. దీంతో చివరి బంతికి సిక్స్ కొడితేనే మ్యాచ్ గెలిచే పరిస్థితుల్లో శాంసన్ ప్రయత్నించినా.. చివరికి బౌండరీ దగ్గర దొరికిపోయి మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు.
శాంసన్ నిర్ణయంపై ఇప్పుడు సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. అతన్ని సమర్థిస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు, ఫన్నీ మేమ్స్‌ను క్రియేట్ చేస్తూ ఇంకొందరు శాంసన్ నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అవతలి వైపు ఉన్నది అనామకుడు కాదు కదా. అతన్ని ఈ మధ్యే రాజస్థాన్ 16 కోట్లు పోసి కొన్నది. ఆ వ్యక్తిపై ఆ మాత్రం నమ్మకం లేదా అని శాంసన్‌ను విమర్శించే వాళ్లు అంటున్నారు.
సంజయ్ మంజ్రేకర్లాంటి మాజీ క్రికెటర్లు అయితే శాంసన్‌ను సమర్థిస్తున్నారు. ఆ సమయంలో టాప్ ఫామ్‌లో ఉండి, బంతిని బలంగా బాదుతున్న శాంసన్‌కు మోరిస్ కంటే తనపైనే ఎక్కువ విశ్వాసం ఉండటంలో తప్పేమీ లేదని వాదిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో శాంసన్ అద్భుతమైన పోరాటంతో కేవలం 63 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు. అయినా చివరికి రాయల్స్ టీమ్ 4 పరుగులతో ఓడిపోయింది.
Not necessarily. It’s whether you think Samson is more likely to hit a 6 than Morris is to hit 4 or 6. The way Samson was hitting it I can see why he would have confidence in himself.
— Jimmy Neesham (@JimmyNeesh) April 12, 2021
No wrong answer really https://t.co/shzLCGkxRZ
Greater possibility of Samson hitting a six in that form than new batsman in Morris hitting a four. Right call by Samson to keep strike last ball I thought.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) April 12, 2021
Sanju Samson denies Chris Morris for a single in the last over
— Gyanendra verma (@gyanii21) April 12, 2021
Meanwhile RR owners who bought Morris for 16.25 crores pic.twitter.com/Pd4WsKzcKQ
Morris to Samson & RR Management : #PBKSvsRR pic.twitter.com/dvHk0X9Bei
— itzz_vijju (@vijayprakashdkd) April 12, 2021
ఇవి కూడా చదవండి
ప్రపంచంలో ఆ 8 మంది దగ్గరే 75 లక్షల కోట్ల సంపద
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ వింత యాక్షన్ చూశారా.. వీడియో
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!
ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
లంగా ఓణీలో మెరిసిపోతున్న శ్రీముఖి
ఉగాది స్పెషల్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ విడుదల