HomeSportsSmriti Mandhana Rises To Number 2 In Odi Batting Rankings
మంధాన @ 2
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నంబర్‌వన్ ర్యాంక్‌కు మరింత చేరువైంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా సూపర్‌ఫామ్ కొనసాగిస్తున్న మంధాన తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు దూసుకొచ్చింది.
దుబాయ్: భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నంబర్‌వన్ ర్యాంక్‌కు మరింత చేరువైంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా సూపర్‌ఫామ్ కొనసాగిస్తున్న మంధాన తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు దూసుకొచ్చింది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ సెంచరీ సహా అర్ధసెంచరీతో రాణించిన మంధాన 738 పాయింట్లతో ఒక ర్యాంక్ మెరుగుపర్చుకుని టాప్-10లో కొనసాగుతున్న ఏకైక భారత బ్యాటర్‌గా నిలిచింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ (773) అగ్రస్థానంలో ఉంది. తొలి సెంచరీతో ఆకట్టుకున్న జెమీమా రోడ్రిగ్స్ రెండు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 17వ ర్యాంక్‌కు చేరుకోగా, హర్మన్‌ప్రీత్‌కౌర్ 15లో ఉంది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తిశర్మ 680 పాయింట్లతో ఒక ర్యాంక్ ఎగబాకి నాలుగులో నిలిచింది. సోఫీ ఎకల్‌స్టోన్ (770) టాప్‌లో ఉంది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తిశర్మ (344) ఆరో ర్యాంక్‌లో ఉంది.