ముంబై : ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు దారుణ వైఫల్యం అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు వేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 37 ఏండ్ల హర్మన్‌ప్రీత్ నుంచి సారథ్య పగ్గాలను అందుకునేందుకు తాను రెడీగా ఉన్నానని ఆమె తెలిపింది.
ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మృతిని ఇదే ప్రశ్న అడుగగా.. ‘అవును. నేను సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పడం చర్చనీయాంశమైంది. హర్మన్ గైర్హాజరీలో 18 టీ20లు, నాలుగు వన్డేల్లో జట్టును మంధాన నడిపించింది. రెండు ఫార్మాట్లలోనూ 15 మ్యాచ్‌ల్లో టీమ్‌ను గెలిపించింది.