దుబాయ్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన(Smriti Mandhana).. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టాప్ మూడవ బ్యాటర్‌గా నిలిచింది. వన్డేల్లో ఇప్పటికే వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆమె.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో స్మృతి మందాన తన పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకున్నది. ఫస్ట్ టీ20లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు గాయం కావడంతో ఆ బాధ్యతలను స్మృతి మందాన పోషించింది. మందాన తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టింది. కేవలం 62 బంతుల్లోనే ఆమె 112 రన్స్ చేసింది. నాటింగ్‌హామ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇండియా 97 రన్స్ తేడాతో విజయం సాధించింది.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్మృతి మందాన తన కెరీర్లో అత్యుత్తమంగా 771 రేటింగ్ పాయింట్లు సాధించింది. దీంతో ఆమె మూడవ ర్యాంక్‌లో నిలిచింది. వెస్టిండీస్‌కు చెందిన హేలే మాథ్యూస్ 774, ఆస్ట్రేలియా బ్యాటర్ బేత్ మూనీ 794 పాయింట్లతో రెండో, మొదటి స్థానల్లో నిలిచారు. భారతీయ మహిళా క్రికెటర్లలో షఫాలీ వర్మ, హర్లిన్ డియోల్.. రాణించారు. షఫాలీ వర్మ 13వ ర్యాంక్‌లో నిలిచింది. బౌలర్లలో పాకిస్తాన్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్.. టీ20ల్లో టాప్‌లో నిలిచింది. 44 రేటింగ్ పాయింట్లతో ఆమె అగ్ర స్థానంలో ఉన్నట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొన్నది.
Already No.1 in ICC Women’s ODI Batter Rankings, India’s star opener now has her eyes on the T20I throne 👑https://t.co/cIPtytfpgD
— ICC (@ICC) July 1, 2025