దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. గత ఏడాదిన్నరకాలంగా ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న మంధాన.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆరేండ్ల (చివరిసారిగా 2019లో) తర్వాత ఆమె అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి.
727 రేటింగ్ పాయింట్లతో మంధాన మొదటి స్థానంలో నిలవగా ఇంగ్లండ్ సారథి సీవర్ బ్రంట్ 719 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ 719 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మంధాన తర్వాత భారత్ నుంచి జెమీమా రోడ్రిగ్స్ (14), హర్మన్‌ప్రీత్ (15) మాత్రమే టాప్-20లో చోటు దక్కించుకున్నారు. వన్డేలలో మొదటి స్థానాన ఉన్న మంధాన.. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉంది.