Asia Cup 2025 : ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లపై వేటు పడింది. ఆసియాకప్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించిన స్క్వాడ్‌లో మాజీ సారథులు బాబర్ ఆజం (Babar Azam), మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan)లకు చోటు దక్కలేదు. మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో ఆదివారం సెలెక్టర్లు 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఈ ఎడిషన్‌కు సల్మాన్ అఘా (Salman Agha) కెప్టెన్‌గా వ్యవహిరించనున్నాడు.
సీనియర్లు బాబర్, రిజ్వాన్ బదులు ఫఖర్ జమాన్ సయీం ఆయూబ్, సహిబ్దజా ఫర్హాన్‌లు టాపార్డర్‌లో ఆడనున్నారు. ఇక పేస్ బౌలింగ్ యూనిట్‌ను షాహీన్ ఆఫ్రిది, హ్యారిస్ రవుఫ్, స్పిన్ దళానికి మహమ్మద్ నవాజ్ నడిపించనున్నారు. ఆసియా కప్ కంటే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గడ్డపై జరుగబోయే ముక్కోణఫు సిరీస్‌లో పాక్ ఇదే స్క్వాడ్‌తో బరిలోకి దిగనుంది. ఆగస్టు 29న మొదలయ్యే ఈ టోర్నీలో ఆతిథ్య యూఏఈ, పాక్‌తో పాటు అఫ్గనిస్థాన్ పోటీపడనుంది.
Happy with the squad, 🇵🇰 fans?https://t.co/agpm26Sxre
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2025
యూఏఈ గడ్డ మీద సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకొని స్క్వాడ్‌లో భారీ మార్పులు చేసింది పాకిస్థాన్ బోర్డు. టీ20 వరల్డ్ కప్ నుంచి వరుసగా విఫలమవుతున్న సీనియర్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్‌లను పక్కన పెట్టేసింది. నిలకడగా రాణిస్తున్న కుర్రాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆసియా కప్ స్క్వాడ్‌లోకి తీసుకుంది.
Pakistan have named their squad for the Asia Cup and the UAE tri-series.
They add pace bowlers Mohammad Wasim and Salman Mirza to the squad that faced West Indies pic.twitter.com/H6lh5DjoWw
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2025
పాకిస్థాన్ స్క్వాడ్ : సహిబ్దజా ఫర్హాన్, సయీం ఆయూబ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ హ్యారీస్ (వికెట్ కీపర్), సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, ఫహీం అష్రఫ్, హుస్సేన్ తలాట్, మహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సూఫీయాన్ మకీం, షాహీన్ ఆఫ్రీది, హారిస్ రవుఫ్, హసన్ అలీ, మహమ్మద్ వసీం, సల్మాన్ మిర్జా.