దుబాయ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు రాణిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు మంచి ఓపెనింగ్ లభించింది. కుశాల్ పెరీరా (12 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన పాథుమ్ నిస్సంక (7) భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చరిత్ అసలంక (28 నాటౌట్) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో శ్రీలంక జట్టు తొలి పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. పెరీరా, అసలంక ధాటిగా ఆడితే శ్రీలంక భారీ స్కోరు చేయడం ఖాయం.